Friday, October 9, 2015

సిగ్గుపడే క్షణం

సిగ్గుపడే క్షణం
________________కృష్ణ మణి

భారతమా సిగ్గుపడు
నీ కొడుకుల అహంకారానికి
ఏడువు
మనసంటూ ఉంటె నీకు
ఇది రాజ్యమా
మతమా
కులమా
కుతంత్రమా !

నీవే గోప్పంటూ ప్రపంచానికి నీతులు చెప్పుతావే
స్త్రీకి కి గౌరవం
అనగారిన వర్గాలకు ఆశాదీపం అనుకుంటావే
ఇదేనా గర్వపాటు
గతిలేని దీనులను చరబట్టే సంస్కృతి
చిన్నచూపులో కలువలు మాడిపోతుంటే
చలికి చేతులు కాపుకుంటావా నిసిగ్గుగా !

రోజుకొక ద్రౌపతి వస్త్రాపహరణం
నిమ్నవర్గాలపై పైశాచిక దాడులు
దినదిన వృద్ది అవుతుంటే
ఎన్ని భారత యుద్ధాలు జరగాలి ?
ఎంత మంది సమిధలై నలగాలి ?

నీబిడ్డనని  మరవాలనిపిస్తుంది
ఏ తల్లి ఒడికి చేరాలోనని 
ఆలోచనవేస్తుంది !


కృష్ణ మణి

No comments:

Post a Comment