Sunday, October 4, 2015

అక్షయపాత్ర

అక్షయపాత్ర

_______________కృష్ణ మణి

ఒంటికి మేలునై
కంటికి చలువనై
పులుపునౌతానంటుంది పంటికి 

ఆటల పందిరై
పాటల ఊడనై
ఊగిపోతానంటుంది అడవిలో  

ఆకలికి గింజనై
పొయ్యిలో కట్టెనై
బొగ్గునౌతానంటుంది చివరికి

ఎండకు గొడుగై
జీవికి ఒడ్డునై
అక్షయపాత్రనౌతానంటుంది లోకానికి  

ఇవ్వడమే తెలిసి
నరికినప్పుడల్లా మూగగొంతుతో ఏడుస్తుంది
తనువెల్ల పాలేనని
కారేది రక్తమని ప్రేమను ఒంపుతుంది బిడ్డకు !

కృష్ణ మణి








No comments:

Post a Comment