వెలుగు బంటు
__________________కృష్ణ
మణి
మసక చీకటి
రాగానే జత చేరి
దొంగచూపులకు
కళ్ళెం వేస్తూ
నలుపును చూసి
దడుసుకునే వారందరిని అక్కునచేర్చుకుంటాను !
అర్దరాత్రి
రోడ్డుపై నిలువునా వెలుగిస్తూ
మోటరు వాహనానికి
కన్నునౌతాను
చీకటి దారికి
అభయహస్తాన్నౌతాను !
వ్యాపార ప్రకటన
బోర్డుపై రాతలను అగుపిస్తూ
షాపు షాపుకు ఒక
వెలుగు ముక్కనై
బతుకుకు పెద్ద
దిక్కునౌతాను !
నగర అందానికి
మెరుపునై
రంగుల మిణుగురౌతాను
!
వీది వీదికి మూల
మూలకు గుర్ఖానౌతను
గుబులు నిండిన
పిల్లల ఆటల కొమ్మనౌతాను
కుక్కల తోడునై
నిర్మానుష
రోడ్డుకు సాక్షినౌతాను !
చివరాకురున
మున్సిపాలిటీ నౌకరు బంటునౌతాను
ఆర్పితే ఆగిపోయే
జిలుగునై
పట్నం పల్లెకు రేపటి
ఆశల పల్లకినౌతను
సాయంత్రానికి మరల
వెలిగిస్తే
చీకటిని తరిమే
వేలుగునై బతుకు బాటనౌతాను !
కృష్ణ మణి
No comments:
Post a Comment