Sunday, October 4, 2015

తానా తందాయి

తానా తందాయి
____________కృష్ణ మణి

సిగ్గుపడని మోము
సిగ్గేలేని వెదవ
సిగ్గంటే తెలియని గుంపులు
సిగ్గు సిగ్గు
ఎదురుపడితే చాలు భగ భగలు
అది ఒకప్పుడు
ఇప్పుడు అలై బలాయి తానా తందాయి !

గడచిన ఇరువది ఏండ్లు
వీరే కదా
గెల్చింది
మాడ్చింది
వంచింది
మేమేకదా
వేసింది
ఏడ్చింది
కూల్చింది !

శత్రువు శత్రువు మిత్రుడు
శత్రువెవడో తెలియని గుడ్డి దారి
శనులన్ని ఒక్కటై ఎవరిని ఉద్దరింప
రాజ్యం బోజ్యం ఆకలి దప్ప !

అక్కడ కూడా ఒక్కటవ్వాలిగా
నీతి బీతి ఉంటె
రోషం గీశం చస్తే !


కృష్ణ మణి  

No comments:

Post a Comment