అరుణం
_________________కృష్ణ
మణి
అరుణం అంటే
గుర్తొచ్చేది మా క్లాస్మెట్ అరుణనే !
మాకేం తెలుసు
కాలేజ్ కి మధ్యలో
బంకు కొట్టి సినిమాకు వెళ్ళడం తప్ప
బస్సు స్టాపులో
అమ్మాయిలను గుడ్లప్పగించి చూడడం తప్ప
వెకిలి నవ్వులు
మెడలెత్తి నడవడం
కుళ్ళు జోకులు
పెద్దలను
చిన్నబుచ్చుకునేల చెయ్యడం
అమ్మ నాన్నలను
ప్రేమించినట్టు నటించడం
అవసరానికి
చిల్లర్రాలుతాయి కాబట్టి
ఇదేగా మాకు
తెలిసిన ప్రపంచం
మేము చూసే లోకం
చూడటం అంటే
గుర్తొచ్చింది
న్యూస్ పేపర్
హెడ్డింగులు కానరావు కాని
సినిమా కబుర్లకై
ఆరాటం
టీవీ చూడటం అంటే
సినిమానో సిరయల్లో లేకపొతే క్రికెట్
టెన్నిస్ కూడా
కేవలం వుమెన్ ఆటైతేనే !
ఇప్పుడు కాలం
మారింది
అరుణోదయ కళా
సంస్థ పాటలు వినే ఆలోచన లేదు
నారాయణ మూర్తి
సినిమా పాటలను వినే ఓపిక మాకేక్కడిది
ట్రెండ్ మారింది
గురు
ఇప్పుడు మాకు ఊపు
రావాలంటే
‘చే’ బొమ్మ
కనపడాలి
రంగ్ దే బసంతి
పాటలు ‘’ బి ఎ రెబల్ ‘’ అని అరవాలి
అంతా మాడర్న్
లైఫ్ కదా !
అరుణోదయ వేల
మొలసిన కత్తులకు వందనాలు అనడం
ఇప్పుడిప్పుడే
నేర్చుకుంటున్నాము
అనగారిన బతుకుల
బాగుకు అడవిలో దివిటీల లాంగ్ మార్చ్ అని
ఇప్పుడిప్పుడే
తెలుసుకుంటున్నాము
ఇంతవరకు
అరుణం అంటే
గుర్తొచ్చేది మా క్లాస్మెట్ అరుణనే !
కృష్ణ మణి
No comments:
Post a Comment