లాల్ రంగ్ పూల్
__________________కృష్ణ మణి
గాజు పై నుంచి కన్ను వాలి
కలం రక్తాన్ని కార్చింది తెల్లటి మైదానంలో !
విస్పోటాలు జరుగుతున్నాయి మనుసులో
అగ్నిపర్వత ‘లావా’ లా
గుండెలో పారుతున్నదంతా ఉక్కులా మార్చి
అక్షరాలనే కత్తులను పుట్టించి
జనాల్లో నిద్రిస్తున్న మనిషిని మేల్కొల్పాలని ఉద్వేగం !
చిన్న తొలుకుకే నిట్టూర్పులో మసలే నిస్సాహాయులకు
ఊపిరి నింపి
అహంకారంతో ఊగిపోతున్న రాజ్యపు ఊపిరినాపాలని పోరాటం !
నాదీ చిన్న ప్రాణమని తెలుసు
తెగిడిస్తే పెద్ద ప్రాణాల్ని మింగే తిమింగలమనీ తెలుసు !
ఏమీ చెయ్యననుకోకు
సంఘటిస్తే
అణుబాంబుల వలె విరుచుకుపడే నవయువ శక్తిలో భాగం నేను !
నేనూ నీ ఆయువును
నీ అంతరాత్మను
‘’జాగో మేరె భాయ్
ఆజ్కా దిన్ తుమ్హారా హై హాల్ చలానేకేలియే
ధర్తి పే లాల్ రంగ్ పూలోంకో ఉగానేకేలియే ‘’ !
కృష్ణ మణి

No comments:
Post a Comment