_____________________కృష్ణ మణి
నమో ఆంధ్ర మాత
గత వైభవానికి చిరునామా
రాయల రాజసమా వెంకన్న దర్శనమా
అమరావతి స్తూపమా తెలుగు పలుకు స్వరమా !
పొట్టి శ్రీరాములు త్యాగ నిరతికి తార్కాణం
భారతావనిలో పువ్వై విరిసిన నవ రాష్ట్రం
సాగరగతీరం బహుముఖ లాభం
కాటను దొర ప్రసాదం నిండిన మాగానం !
శ్రీశైలం మల్లన్న బెజవాడ దుర్గమ్మ
అరసవెల్లి సూరన్న కాళహస్తి లింగన్న
ఏరికోరి వెలిసిరి ఎల్లరులకు ఎదురులేదు
పలు దిశల కీర్తిపరులు తలదించని నీ బిడ్డలు !
రాయలసీమ పౌరుషం కోనసీమ అందం
అరకు కొండ చలువ గుంటూరు కారం
కృష్ణ గోదవరి తుంగభద్రల పరువల్లతో పరుగుపెట్టు
తోబుట్టులలో అడుగు ముందు పెట్టు !
కృష్ణ మణి
No comments:
Post a Comment