డోలు తాళం కాలి గజ్జే గంతులేస్తు ఉన్నయి
నడూర్ల డప్పులన్ని గుంపుగడుతున్నయి
తమలబాజ టక టకమని తాలమేస్తున్నది
బ్యాండుగోట్టే చేతికర్ర తీన్మారాడుతున్నది
ఊరువాడా నోరునోయ్యా తెలంగాణా అన్నది జై తెలంగాణా
అన్నది
పల్లెనిండా పోరుగాలి సల్లవడ్డానన్నది
కండ్లనీరు ఆరవెట్టి దమ్ముదీయమన్నది
ఎడసుడు చేట్టుచేమ నీల్లందుకుంటమన్నయి
రేపోమాపో చిగురు పెట్టి చింతదీరుస్తమన్నయి
గుట్టాపుట్టా నోరునోయ్యా తెలంగాణా అన్నది జై
తెలంగాణా అన్నది
పట్నం కోటల దుమ్ము జారి అడుగుబడతానన్నది
వెలుగు బుగ్గల పాత గుర్తులు కొత్తగ మెరుస్తున్నయి
కండ్లనిండా వెలుగు చూసి పువ్వులు
నవ్వుతున్నయి
అమరవీరుల కన్నకలలు నెరవేరి ఆడుతున్నయి
పట్నంకోటలు నోరునోయ్యా తెలంగాణా అన్నది జై
తెలంగాణా అన్నది
No comments:
Post a Comment