_________________కృష్ణ మణి
కదలిపోరా చెదిరిపోరా మసలిపోరా
ఆ కంటినీరులో కొట్టుకుపోరా !
ఒంగిన నడుములు తిరిగిన చేతులు కాళ్ళు
మరగుజ్జుల ఆటలో మూటగట్టిన ఒళ్ళు
పసి ఆటలు మానిన అమాయక చూపులు
ముసలి వారైన పెళ్ళికాని కొడుకులు
తల్లికావలిసిన పడతి చంటి పిల్లోలె పాకుడు
గుండె రాయిగా చావని తనాన బతుకులేని సాకుడు !
కడుపుతీపి మధురం అది చెరగని సత్యం
కన్నవారే ముసలితనాన ముడ్డికడికే దుఃఖము
ఎవడన్నం గుంజారో ఈ నరకంలో పడ్డారు
ఏ పాపం చేసారో ఈ గడ్డపై పుట్టారు
మానవత్వం లేని రాజకీయ కొజ్జాల కోలాటంలో కృశించిన
తనవులు
విషనాగుల ఎంగిలి నీళ్ళే గతని తెలిసినా తప్పని
దాహపు కడుపులు !
కృష్ణ మణి I 29-05-2014
No comments:
Post a Comment