____________________కృష్ణ మణి
పొట్ట విచ్చుకొన ఆకలాకలంటూ
అలసిన విత్తుల బిత్తర చూపు
తడసిన తనవున పొట్టపగిలి
నార తేలి మురుగుతున్న సమయం !
దాహం ఎరుగని పచ్చ రంగు పిచ్చి రంగుగా మారే తరుణం
తనలోనే తాను కుమిలి కమిలే ఆకు అలముల మూగ రాగం
మొదలు తడువా అడ్రస్సు తెలువక
ఉన్న చోటే ఎండుతున్న మొద్దులు !
కంటిచూపుకు కనబడు మడుగుల బురదలో ఆడ
కాళ్ళు లేని చిటారు కొమ్మల చిట్టి చేతుల ఆరాటం
నింగిలో దిక్కులు ఉంచి అడుగున అలుపెరగని పోరాటం
చినుకు రాల్చి చూడు చిందులేస్తానంటున్న ఆకలి
తిప్పలు
వరద ఒంపి చూడు ఉరుముతో రంకెలేస్తామంటున్న కప్పలు !
కృష్ణ మణి I 20-06-2014
No comments:
Post a Comment