___________________ కృష్ణ మణి
లేలేత బొక్కల మీద ఏనుగుల మోత
సదువులేమోగాని స్కూల్ డ్రెస్సుల రోత
కనికరం లేని కాన్వెంటు స్కూల్ కోత
మెదడున A B C D ఎలుకల వేట !
హోంవర్క్ చెయ్యలేదని గుడ్లెర్రజేసిన సారులు
బిక్కచూపుల లేత మొగ్గల కండ్లళ్ళ వాగులు
ఆటలంటే అలవని పసి తనపు తనువులు
ఆనాటి అల్లరి పిల్లల ముద్దుల బిడ్డల నవ్వులు !
అంతుచిక్కని గజి బిజీ పజిల్ పరుగులు
బతుకు నేర్పు నేర్వ భుజాన బరువు మోసి
బుడి బుడి నడకల ఆడే ఆటలో పాడే పాటలు
అలసి అమ్మజేరి ఒడినాడు మెరిసే కన్నులు !
కృష్ణ మణి I 22-05-2014
No comments:
Post a Comment