తిరుగుతూ తిరుగుతూ
ఒకచోట అలసిన సంసారాల గూడు
ఎవరికీ ఎవరో అర్ధం కాని
సజీవంగా మసలే నిర్జీవ బతుకులు !
అచ్చేదన లేదు
ఆసరా లేదు
నిలువ నీడ లేదు
నాలుగు దారులు కలిసే చోటే పరుగులు
రెడ్ సిగ్నల్ వెంట !
నిలబడే శక్తి ఉన్న పాపైన బాబైన
పొట్ట నింపుకొన ఆరాటం
రెక్కలొచ్చిన పక్షి పోరాటం !
వయసుకు వస్తే
బతుకును మోయాలి
కడుపున పసి గుడ్డును మోయాలి
అదే వారి జీవితం
అలసిన కడుపులకు
మరో రెండు కాళ్ళు రెండు చేతులు
తోడవుతాయని ఆరాటమేమో
అమాయకంగా !
చలికి వణుకుతూ
వానకి తడుస్తూ
ఎండకి ఎండుతూ
సాగుతున్న ఈ పయణం
చివరకు ఏ దరి చేరునో
ఈ గమ్యం తెలియని నడి సముద్రపు నావ !
కృష్ణ మణి
No comments:
Post a Comment