________________కృష్ణ మణి
ఈయల్ల పంద్రాగస్టు కదా
గోవిందు గాడు నేను మల్లేశ్ గాడు
ముంగల కూసన్నం స్టేజి కాడ సక్లముక్లం
బెట్టుకొని !
మా అమ్మకు జరం
మా అన్న చాయ్ పెట్టిండు
రూపాయి ఫైను బిస్కెట్ నానవేట్టుకొని తిన్న!
మల్లేష్ గాడు ఎం సోకులవడుతడో
కొత్త బట్టలేసుకొని ఏమన్న నీల్గుతడా వాడు
గోవిందుగాడైతె దినాం ఏం తినకుండనే వస్తడు స్కూల్కి
పగటిల్ల్య ఆయమ్మ పెట్టె బువ్వ తింటనే పొద్దు గడుస్తది ఆనికి !
పెద్ద కిలాసోల్లు చేతులు వట్కొని
ఊర్ల తిరగనీకే పోయిండ్రు
ఈళ్ళు పోయినంకనే జండలెగురుతయి ఆడ !
ఎనిమిది గొట్టంగ కూసున్నం
ఊర్ల పెద్దమనుషుల కోసం దిక్కులు సూడవట్టె మా
హెడ్ మాస్టర్ సారు
వచ్చిన్రు తెల్లబట్టలల్ల మెడలెత్తి నడుసుకుంట
పది గొట్టంగ
జండ ఎగిరింది
సప్పట్లు కొట్టినం మురిపెంగా
మా సార్ చేతిలకెంచి మైకును తీసుకున్నరు
ఇగ వొర్ల వట్టె నేనింత నువ్వింత అనుకుంటా !
ఈల్లేం మాట్లాడుతున్నరో అర్ధం అయితలేదు కాని
మా కాళ్ళు గుంజి తిమ్మిర్లు వడుతున్నై
కండ్లు తిరుగుతున్నై
దూపైతుంది ఇంక ఆకలైతుంది
మొగులైయ్యింది
అయినా ఇడుస్తలేరు మైకుని
కోతికి కొబ్బరి శిప్ప దొరికినట్లు చేస్తున్నరు !
మొత్తానికి పన్నెండు దాటింది
ఆకలైయ్యిందేమో పాపం చేతులూపి జైహింద్ అన్నరు
హమ్మయ్యని కిలాసులకు లైన్లు గట్టినం
సీటు మిక్షర్ పెట్టిండు సారు !
ఇంటికొచ్చి
అమ్మకు నాయినకు ఇంత పెట్టి తిన్నం మురుసుకుంట !
కృష్ణ మణి
No comments:
Post a Comment