Friday, December 19, 2014

అక్క


_______________కృష్ణ మణి

మాకూ ఒక అక్క ఉండేదట మా అమ్మ చెప్పింది
రెండేళ్ళ వయసులో కాల చేసిందట
అప్పటికి మేము పుట్టలేదు !

నా మిత్రుడి అక్క ఇంట్లో కోలాహలం చూసి ఫీల్ అయ్యేవాణ్ని 
సోదరి ఆప్యాయతకి మురిసిపోయేవాడిని   
చాలసార్లు అనిపించేది అక్క బతికుంటే ఎలా ఉండేదని !

మేనమామ అనిపించుకునేవాడిని
దాదాపు ఈపాటికి చదువులు ముగిసి పెళ్లీడు కొచ్చేవారు
తోడబుట్టిన ప్రేమ పొందని అబాగ్యున్ని !

ఫేస్బుక్ కలిపిన ప్రేమలు కొన్ని నా చుట్టూ
అక్క పలకరింపు తెలిసి కళ్ళవెంట జారిన ఆనందం
పోయిన ప్రేమను పొందిన క్షణం  !

నిజంగా దేవుడు కలిపినా అక్కేనని
తన తోడబుట్టినవాడి పేరు విన్న
ఇంకా తన కడుపున పుట్టినవాడి పేరు విన్న తెలిసిపోతుంది !

తన పనులని పక్కనబెట్టి ఈ తమ్ముడికి సహాయం
దూరాన్ని లెక్క చెయ్యని ధైర్యం అక్క సొంతం
ఉన్నవి పోతున్నా బాదలేదు కాని పోయినవి దొరకడం సంతోషం !

ఈ రోజు అక్క దూరంగా వెళుతుంది కొత్త ఆశతో
తను ఏడుస్తూ తన వారి కడుపు నింపడానికి
భారం మొయ్యడమే తెలిసిన పిచ్చిది !

తన మనసులో తమ్ముళ్లలో ఒకన్ని, కొడుకుల్లో ఒకన్ని  
నా కోసం ఆలోచించే అక్క ఆవేశాన్ని అర్ధం చేసుకొని సముదాయించే అమ్మలాంటిది
తను అనుకున్న లక్ష్యం అందుకొని ఆనందంగా ఉండాలని ఈ తమ్ముడి ఆశ !


కృష్ణ మణి I 24-11-2014 

No comments:

Post a Comment