_______________కృష్ణ మణి
పాలోడిని అంటే పాలు పంచుకుంటోన్ని కాను
పాలు పోశెటోన్ని బర్రేపెరుగు అమ్మెటోన్ని
సైకిల్ కు రెండు డబ్బలు అటు ఇటు
హండిల్ కు చిన్న డబ్బల అద్దలీటరు మాపు !
కొండకు పోతున్న పాలువొయ్య
కొండ అంటే ఉత్త కొండ కాదు గోల్కొండ
బంజర్ దర్వాద దాటి పక్క గల్లిలో అత్తరు మత్తు
తెల్లారక ముందే లేశి బర్లదొడ్డిల కంపు సుషే ఆదత్
ఉన్న నాకు
ఇక్కడికి రాంగానే మనసు గుంజుతది ఇంతసేపు ఉండనీకే !
పొద్దెక్కిన పొద్దు దిగని పరదా చాటు ఆడోళ్ళు
నా గొంతు ఇనంగనే ‘’ క్యా హువా భాయ్ ఆజ్ తుం ఆగయ్ , పానికే ట్యాంక్ లేకే ‘’ అని
నవ్వాల్నో ఎడువాల్నో అర్డంగాక ‘’ ఆజ్ ఆచ్చే లాయా
అమ్మ ‘’ అనడం మామూలే నాకు
ఇల్లిచ్చే పైసలతో సోప్పకుట్టి తీస్కరమ్మని అన్న
మాట !
లంగర్ హౌజ్ మీదికేని నానల్ నగర్ ఒచ్చి బెకిరీల
బిస్కెట్ తిని టోలిచౌకి
బరువు మొయ్య చాతగాక కుట్టి సంచి మీదేసుకునే
పహిల్వాను గాని
రోడ్డుమీద పోయేటొల్లను బతిన్లాడి ఇంటిదాకా
నూక్కుంటా వస్తే మూడు గొడతది !
ఆకలి మీద నేనుంటే దుడ్డేలు దూపకు సూడవట్టే
నా పాణం అమాయక మూగపాణాల మీద గుంజవట్టె !
కృష్ణ మణి I 27-11-2014
No comments:
Post a Comment