గుడ్డీగలు
______________కృష్ణ మణి
ఎదో నిశబ్దం మా చుట్టూ చేరి
మమ్మల్ని తరుముతున్నట్లు అరుస్తున్నది
స్కూల్ గేటు తీసుకొని మా నాన్నల్లగా కొందరు
ధైర్యానికి మారుపేరైన దుస్తుల్లో మీ పిరికి
పిచ్చోళ్ళు అడుగుపెట్టారు !
మేము పిల్లలం మీ పిల్లలం
లోకం తెలియని పువ్వులం
నవ పాకిస్తాన్ నిర్మాతలం
రేపటి రోజుకు వారసులం !
మేము మీ బాషనే మాట్లాడుతాం
వేసుకొనే యునిఫారాల్లో మతం రంగునే వాడుతాం
మతం మానవత్వాన్ని నేర్పుతుందంటారు మరి మీరేం
నేర్చుకున్నారు
కన్నా బిడ్డల్ని మింగే త్రాచుల్ల వెర్రి ఆలోచనల్లో
మమ్మల్ని సమాధి చేస్తున్నారు !
గుడ్డీగల్లాగా మీ అందత్వంతో
మా మెదల్లను గుచ్చి గుచ్చి చంపారు
మా అమ్మి అబ్బాల ఆశా జ్యోతులం మీలాగే అల్లా నే పూజిస్తాం !
మేమేం తప్పు చేసాము
మీ అమ్మి ఆబ్బాల్లేరా మీకు బుద్ది చెప్పడానికి ?
మా చాతిలో దించిన తూటాలు ఎవరివి ?
మీ చేతిలో నెత్తుటి మరకలేవరివి ?
మా స్నేహితులు కళ్ళముందు ఆహాకారాలతో
శ్వాసవిడుస్తుంటే
మా శ్వాస ఆగిపోయింది
తేరుకొని చూస్తె శవాలగుట్టలే !
కృష్ణ మణి I 16-12-2014
No comments:
Post a Comment