________________________కృష్ణ మణి
ఒకనాడు అడవి ప్రపంచంలో అందరిలా ఒకన్ని
ఆకలిపోరాటంలో విసిరిన రాయి ఇంకో రాయిని ముద్దాడి
అగ్గిని కన్న క్షణాన మెరిసిందేదో నా మెదడున
కాలిన కళేబరాల రుచి బాగుందని మల్లి మల్లి తినాలని
ఆరాటం !
ఆ అగ్గి కోసమే కదా ఎన్నో యుద్దాలు చేశాను
చరిత్ర రాయని కాలాన దాగిన వీర గాధలెన్నో
యుగాలు గడిచేకొద్దీ ఎన్నో వింతలు సృష్టించి వింతగా
మారిపోయా !
కమ్మరి కొలిమి నుండి కర్మాగారం దాక
కాగడ దివిటి మొదలుకొని LED బుల్బు దాక
గుడ్డకట్టని గుడిసె ఎరుగని గుహల బతుకు నుండి
గుడ్డలిప్పుకొని తీరాన సేద తీరు దాక !
ఈ ఇంగలం కోసమే కదా ఇంధనం వేట
భూమిని తోడాను సంద్రం తోడాను అతి తెలివితో ఓజోనును
కూడ
వేటకు అడ్డు అదుపు లేదు సకల జగత్తును చరబట్టిన
మేధావిని !
నీరు బొగ్గు పెట్రోల్ గాలి సూర్యకాంతి వస్తువులై
బతుకు ఇస్తరులై
నవ నాగరిక ప్రపంచాన్ని మూల శక్తులై నడిపే ఇంధనాలు
మస్తిష్కం ముదిరి మతిలేని ముచ్చు మనసు నాది
చంద్రునిపై ఉంటానని ఉరుకులాట గ్రహాలపై జీవశక్తికై
వెతుకులాట !
అమ్మ ఒడిలో పాలధారాలతో పైత్యం ఎక్కిన అమాయక
శిశువును
పచ్చని వనాన్ని పసందుగా తిని ఎడారిగా పిప్పి చేసిన
రక్కసుడను !
కృష్ణ మణి I 10-10-2014
No comments:
Post a Comment