_______________కృష్ణ మణి
ఆధారాల తడిలో నిత్యం స్నానం చెయ్య తలచితిని
నీ చూపు వెన్నల్లో మురిసిపోవాలని వేచిన చెలికాడను !
వర్షంలో నుదుటిని ముద్దాడే చుక్కనై
శ్వాసలో స్వేచ్చగా తిరిగే బందినై
కనులముందు నవ్వుపంచే మిత్రుడినై
పాదానికి అడ్డుపడే ముల్లుకు శత్రువునై
నీ రక్షణాదక్షుడనై నిలచిన సేవకుడిని !
అందం చూసుకోను అద్దమై నిను నువ్వు ఈర్షపడేలా
ఉంచాలని
వాలు జడలో ఇరికిన ప్రాణం క్షణం కూడా దూరం ఉండక
నీ మనసు చేరాలని ఎదురుపడే దేవుడికి దండాలు
పెడుతున్నాను !
నాలో నిన్ను బందించాలని ఆపసోపాలు పడుతున్న
వెర్రివాడిని
నీ అలసట మాన్పే తల దిండునై సేవ చేయ్యగోరు
చిన్నోడిని !
కృష్ణ మణి I 20-11-2014
No comments:
Post a Comment