ఇన్నళ్లూచూడంది ఇవ్వాల్నే చూసిన
అందుకే నవ్వంటే పడిజస్తనే ఓ ప్రియసఖియా...!
రాత్రిల్లో నీ అందం జగమంతా
వెన్నెలనే నరదిష్టి
పడకుండా బుగ్గమీద కాటుకెట్టుకోవే...!
రాళ్ల లో మెరిసేటి రత్నము నీవే...
సంద్రంలో
ఒదిగిన ముత్యము నీవే.....
చంద్రవంకవు
నీవే , రాతి బొమ్మవు నీవే పాపనవ్వులు నీవే , ఎండి పుత్తడి నీవే అందుకే
నవ్వంటే పడిజస్తనే ఓ ప్రియసఖియా...!
నువ్వాడితే నెమలి ఆగిపోదా... నువ్వు పాడితే కోయిలా మూగబోదా....
ఊదె వేణువు నీవే , మీటె వీణవు నీవే నీటి పరుగువి నీవే , కాళి గజ్జెవి నీవే అందుకే
నవ్వంటే పడిజస్తనే ఓ ప్రియసఖియా...!
ఎడారిలొ నీటి ఊటవు నీవే నేలమీద పెరిగే
పైరువు నీవే పూచె పువ్వువి నీవే , కాచె కాయవు నీవే అడవి ఆకువి నీవే , లేత మొగ్గవు నీవే అందుకే నవ్వంటే పడిజస్తనే ఓ ప్రియసఖియా...!

jorugundi janapadagitam
ReplyDelete