
ఆరడుగుల అందగాడు కాని, చెవులు వినపడవు !
సుందర ముఖ విందము కాని , చూపు మెల్ల !
కండలు తిరిగిన ఒళ్ళు కాని , మొండేలు !
నల్లని కురులు కాని , ఉండల జుట్టు !
బంగారు వన్నె తోలు కాని , తెల్ల మచ్చలు !
గల అబ్బాయికి పిల్ల కావలెను
జాతి మత కుల భాషాభేదం లేదు !
ఐదున్నర ఎత్తు , కలువ కనులు ,బంగారు వన్నె కాంతి ఒళ్ళు !
సహనంలో భూదేవి , ధైర్యంలో రుద్రమ్మ , చిరు నవ్వులో లక్ష్మి ని పోలి ఉండాలి !
రంభ ఉర్వశి మేనక ఐన పర్వాలేదు !
కట్నం మీ స్తోమతను బట్టి , ఎంత లేదన్న పది లక్షలు ఉంటె చాలు !
-Krishna Mani
No comments:
Post a Comment