రోజు సందడిగా ఉండే చౌరస్థ. అక్కడే పక్కన కూరగాయలు అమ్ముకొనే స్త్రీ , ఆమెకు చేదోడు వాదోడుగా
ఉండే 6 లేక 7 సంవత్సరాల పాప.కూరగాయల బెరసారల్తో తల్లి, చుట్టూ జనాలను చూస్తూ సరదాగా ఉండే పాప. సాయంత్రానికి పని ముగిందు కొని ఇంటికి చేరితే తాగుడుకు భానిస ఐన భర్త చేతిలో దెబ్బలు , చేసిన కష్టం మొగుడి తాగుడికి పోతే మిగిలేది తల్లి పిల్ల కడుపుకే . ఏదో ఒక రోజు భర్త మారతాడని, దేవుని మీద భారం వేసి మంచి రోజుల కోసం ఎదురు చూపులు . కనీసం పాపకు మంచి డ్రెస్ కొనాలని ,మంచి భోజనము పెట్టాలని ఆశ .
రోజు కూరగాయల కొట్టు దగ్గర తల్లితో కూర్చొని వచ్చే పోయే పిల్లలను గమనిస్తూ , తను స్కూల్ కి వెళ్ళాలని , స్కూల్ యునిఫోరం లో తనను తాను ఉహించుకొంటు లోలోన బాధ పడే పాప .
పండగ రేపనగా భారి లాభాలను చూసుకొని పాపకు డ్రెస్ కొందామని ఎంతో సంతోషం తో ఇల్లు చేరిన భార్య. డబ్బు భర్తకు కనపడకుండా దాచగా , భర్త వచ్చి డబ్బు వెతకగా దొరకదు. అసలే తాగుడికి భానిస , భార్య డబ్బు జాడ చెప్పక పోవడంతో తీవ్రంగా ఆవేశానికి లోనై ఒళ్ళు హునమైయ్యెటట్లు కొట్టగా భయపడిన పాప డబ్బుజాడ చూపి తల్లిని రక్షిస్తుంది .దెబ్బలతో తల్లి స్పృహ తప్పగా ఆకలిని ఓర్చి తల్లిని ఓదార్చుతూ పడుకుంటుంది .
తెల్లారింది తల్లి లేవలేదు ,తగిలిన గాయాలను చూసి తల్లిని లేపడం ఇష్టం లేక పాప ఒక్కతే గుడిసె బయటకు వెళ్ళిపోయింది . కొన్ని గంటల తరువాత మెలుకువ వచ్చిన తల్లి పాప గుర్తుకు వచ్చి వెతకడం మొదలు పెట్టింది , చుట్టూ ఉండే జనాలను పాప జాడ అడిగింది అందరు మాకు తెలవదు అంటున్డటంతో లోలోపల ఉత్ఖంట , పాపకు ఏమి కావోద్దంటూ కనిపించిన దేవుడికి మొక్కుకొంటు వెతుకుతుండగా భర్త తారస పాడగా పాప విషయం చెబుతుంది , తాగుడు భానిసత్వం వాళ్ళ తానూ ఎలాంటి పొరపాటు చేసానని , పాపను పోగొట్టుకున్నానని పశ్చాతాపంతో తాను కూడా పాపను వెతుక సాగగా , ఎటు కనబడక భార్య భర్తలిద్దరూ ఆవేదనతో రోడెంట వెతుకుతుంటారు .
మిట్టమధ్యానం చౌరస్థ దగ్గరలో జనాలందరూ గుమ్మిగుడటం చూసిన భార్యాభర్తలు కంగారుగా అటువెల్లి జనాలను తోసుకొంటూ దగ్గరగా వెళ్ళగా ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం . అక్కడ ఉన్నది తమ పాపే . భోరున విలపిస్తూ పాపకు ఏమైనదని , పాపను తడుముతూ ఉంటారు , స్పృహ కోల్పోయిన పాప పై నీళ్ళు జల్లగ , మెల్లగా మెలుకువ రాగ పాప కళ్ళు తెరిచి చూడగా ,తాను ఉన్నది తన తల్లి ఒడిలో అని గమనించి ఆనందంతో కన్నీళ్ళు పెట్టగ . చుట్టూ ఉన్న జనం తల్లి తండ్రులను పాపను ఈ రకంగా రోడ్డుపైన వదిలేస్తారా అని విసుక్కొంటు వెళ్తారు.తల్లి పాపను ఇక్కడకెందుకు వచ్చావు అని అడగగా ,పాప '' కురగాయలమ్మి నీ దెబ్బలకు మందు తెద్దామని కొట్టు తెరిచిపెట్టాను , రాత్రి నుంచి ఏమి తినలేదు అమ్మ ఆకలేస్తుంది '' అనగా భార్య భర్త వైపు చూస్తూ ఏడుస్తూ మనకేంటి ఇలాంటి పరిస్తితి అనట్టు చూస్తుంది . తండ్రి తానూ చేసిన తప్పుడు పని వల్ల ఈ పరిస్తితి వచ్చిందని తానూ మద్యం మానేస్తానని పాప మీద ప్రమాణం చేస్తాడు .
మన దేశంలో సగటు మనిషి ఆర్థిక పురోగతి సాదించే వరకు , చెడు అలవాట్లను వదిలే వరకు ఇలాంటి పసి పాపలేందరో వారి భవిష్యత్తును నాశనం చేసుకోక తప్పదు .మనం ముందు తరాలకు ఇచ్చే బహుమానం ఇదేనా ?


No comments:
Post a Comment