పాడితినో మాయన్న మా గుల్ల్య పాటలన్నీ
ఆడితినో మాయన్న మా ఉల్ల్య ఆటలన్నీ
రంగన్న తీసే రాములోరి పాటరో
మేమంతా అందుకొని చప్పట్లతో పాడేనో
దుర్గమ్మ ఎల్లమ్మ శంకరుని పాటేలే
మొదలెట్టే సుద్దుల్ని పెద్దమనిషి లేశిరో
రాగామందక మా నవ్వుకు గుప్పించి గులుగురో
డోలక్ దరువుల నడుమ గణేశుడెల్లెరో
కన్జర్ల మోతలో మేమాడి పాడేరో
మల్లోచ్చే యాలకు ముందుగానే ముచ్చట్లురో
నా దాండు దెబ్బకు గిల్లి మాయమాయేనో
రాయి రంగన్న ఆటలో సీనుగాడు కుంటేరో
టైర్ల పరుగులో అలసిన ఆగని హుషారులో
గుంతలాటలో చిత్తగిన్జల డబ్బలె నింపేరో
విరి విరి గుమ్మడని నాకన్లను మూసేరో
లోలో తుమ్మప్పలో సూడలే ఎంకవడ్డ చల్లరో
సీకాటలో మల్లన్న లెక్క వెయ్యి మీద సాగేరో
చెట్ల పందిరిలో చిట్టునిండా కోతులే
గోటిలాటలో మా జేబుల్సూడ మేక పాలతిత్తులే
లోన్ బుర్రు ప్రతి గడి ఒక పంజరమే
పెంకలాటలో పగిలే మా ఎదిటోడి వీపులే
హరి భురి సీమల ధరి, రాజు కోటకే లంకల గురి
హరి భురి సీమల ధరి, రాజు కోటకే లంకల గురి
హరి భురి సీమల ధరి, రాజు కోటకే లంకల గురి
యాడికెల్నయొ ఆ రోజులు యాడికెల్నయొ
యాదికొచ్చి నా గుండెను తోడుతున్నయో
ఆ రోజులు గావాలంటే నేను మల్ల పుట్టాలే
పుట్టినా, ఆ ఆటలుపాటలు, మనషుల ఆత్మలు
ఉండున ఈ రోజుల్ల ఆ నిండు కుండలు


మణిజీ, పల్లెపిల్లలాటల పాట చాలా బాగుంది ఎన్ని ఆటలు గుర్తొస్తే అన్నింటిని పాటలో చేర్చండి
ReplyDelete