స్వప్నం
_____________కృష్ణ మణి
ఓ స్వప్నమా
నా జన్మ జన్మల అనుభందాల దృశ్య హారామా
విశ్వాంతరాల గుట్టును చూపిన దైవమా !
గడచిన నా బతుకున కల్లోల చిత్రాలు ఎన్నో
అప్పుడప్పుడు తడిమి తడిపే కన్నీటి జ్ఞాపకమా
చూపించావు చాల
నవ్వించావు
కవ్వించావు
వినిపించావు
బెదిరించావు
ఎన్నటెన్నటికిని నా దానివై
ఈ లోకాన్ని నీ కళ్ళతో చూపావు !
విశ్వం
విస్పోటనం చెంది
కుప్పలుగా కుప్పలుగా
రాళ్ళు రప్పలు కలగలపి
ఇంకా ఆరని సెగలు
మరిగే గోళాలు
వాటి చుట్టూ లెక్కకు అందని ముక్కలు
అనుకోలేదు ఇలా చూస్తానని
నిజమో కాదో ఆ దృశ్యం
చూసాక నమ్మలేని ఆశ్చర్యం
అక్కడక్కడ రంగు రంగుల మిల మిలలు కంటికి ఇంపుగా
అక్కడక్కడ మేఘాల్లాగా దుమ్ము ధూళి నిండుగా !
ఒక నల్లని సుడిగుండం లాంటి ఆకృతి లోకి
చిన్నవి పెద్దవి అన్ని తమకు తామే ఎవరో నెడుతున్నట్లు వెళుతున్నాయి
బహుశా కృష్ణ బిళం అంటే ఇదేనేమో
కృష్ణ బిలం ఆవల ఏముందో ...
కాని ఇది ఒక్కటి ఉన్నట్టు లేదు
ఇలాంటి ఇంకెన్నో టోర్నడోలాగా ఉన్నాయి !
ఆది అంతం
నిలువు అడ్డం తెలియని సంకట స్తితి
ఎటెల్లాలో అర్ధం గాక ప్రశ్నలవాగు యదలో పొంగుతుంది !
అసలు ఈ సమస్తం ఇలాగాక మరోల
ఈ భూమి చంద్రుడు లేకుండా
భూమ్మీద మనిషనే వాడే లేకుండా ఉంటే
ఏంటి ఈ సృష్టి రహస్యం !
ఎంత వెతికినా అంతుబట్టక
యదలో మరుగుతున్న అగ్ని పర్వతం
స్వప్నమా నీకో దండం !
కృష్ణ మణి
_____________కృష్ణ మణి
ఓ స్వప్నమా
నా జన్మ జన్మల అనుభందాల దృశ్య హారామా
విశ్వాంతరాల గుట్టును చూపిన దైవమా !
గడచిన నా బతుకున కల్లోల చిత్రాలు ఎన్నో
అప్పుడప్పుడు తడిమి తడిపే కన్నీటి జ్ఞాపకమా
చూపించావు చాల
నవ్వించావు
కవ్వించావు
వినిపించావు
బెదిరించావు
ఎన్నటెన్నటికిని నా దానివై
ఈ లోకాన్ని నీ కళ్ళతో చూపావు !
విశ్వం
విస్పోటనం చెంది
కుప్పలుగా కుప్పలుగా
రాళ్ళు రప్పలు కలగలపి
ఇంకా ఆరని సెగలు
మరిగే గోళాలు
వాటి చుట్టూ లెక్కకు అందని ముక్కలు
అనుకోలేదు ఇలా చూస్తానని
నిజమో కాదో ఆ దృశ్యం
చూసాక నమ్మలేని ఆశ్చర్యం
అక్కడక్కడ రంగు రంగుల మిల మిలలు కంటికి ఇంపుగా
అక్కడక్కడ మేఘాల్లాగా దుమ్ము ధూళి నిండుగా !
ఒక నల్లని సుడిగుండం లాంటి ఆకృతి లోకి
చిన్నవి పెద్దవి అన్ని తమకు తామే ఎవరో నెడుతున్నట్లు వెళుతున్నాయి
బహుశా కృష్ణ బిళం అంటే ఇదేనేమో
కృష్ణ బిలం ఆవల ఏముందో ...
కాని ఇది ఒక్కటి ఉన్నట్టు లేదు
ఇలాంటి ఇంకెన్నో టోర్నడోలాగా ఉన్నాయి !
ఆది అంతం
నిలువు అడ్డం తెలియని సంకట స్తితి
ఎటెల్లాలో అర్ధం గాక ప్రశ్నలవాగు యదలో పొంగుతుంది !
అసలు ఈ సమస్తం ఇలాగాక మరోల
ఈ భూమి చంద్రుడు లేకుండా
భూమ్మీద మనిషనే వాడే లేకుండా ఉంటే
ఏంటి ఈ సృష్టి రహస్యం !
ఎంత వెతికినా అంతుబట్టక
యదలో మరుగుతున్న అగ్ని పర్వతం
స్వప్నమా నీకో దండం !
కృష్ణ మణి
No comments:
Post a Comment