Friday, September 4, 2015

గురువు

గురువు
_____________కృష్ణ మణి

విశాల వనంలో ద్వని ప్రతిద్వనై
చుట్టూ ధైర్యమనే కవచాన్ని కరుణించింది తల్లి ఒంటరిని కానని !

కొండల గుట్టల అంచున నిలబడే మేకల గిట్టలు
కష్టాల దారిని దాటడానికి స్పూర్తినిచ్చాయి !

నిలకడ లేని అలలపై తేలిన తుంగ
ఆటుపోటులకు తలెత్తి ఎదుర్కోమని చెప్పింది !

పచ్చగ పెరిగే చెట్టు
కాలం తిరిగి మోడువారినప్పుడు
అన్నింటినీ  ఓర్చుకొనే నేర్పుండాలనన్నది  !

ఏటికి ఎదురీది చెరువు చేరే
పిల్ల కాలువల వెంట పరక పిల్లలు
చేరాల్సిన గమ్యంపై గురిని పెంచాయి !

నిశబ్దాన్ని నింపుకున్న రాళ్ళు రప్పలు
దేనికీ బెదరొద్దని నవ్వుతున్నాయి !

అవును ప్రకృతి గురువై తోడుంది
నేను మాత్రం గురువును చంపుతూ ఒంటరిగా పరుగేడుతున్నాను !
  

కృష్ణ మణి 

No comments:

Post a Comment