టైం వేస్ట్ బాస్
... మీతో
_______________కృష్ణ
మణి
ఊహల పల్లకిలో
ఊరేగుతున్న క్షణం
లోకం ఎలా పొతే
నాకెందుకు
ఎందుకంటే అప్పుడు
నాగురించే ఆలోచించను !
నేను
నిద్రిస్తేనే కదా ఉదయం నాకు
రేపటికి పరుగు పెట్టడానికి
ఎల్లుండి పూట గడవడానికి
!
ఎండమావుల వేటలో
డైలీ
అందని ద్రాక్షని
అందుకునే ప్రయత్నం
అందనిదేదని పొగరు
లుక్ !
ఇది అవునా అది
అవునా అంటూ
తీరిక మాటలు లేవు
ఇటు అటు చూపులకు
మెడ నొప్పులు పుడతాయి
గొంతునొప్పులొస్తాయి
టైం వేస్ట్
అవుతుంది
అసలే ‘’కోలన్’’
కు ‘’సెమి కోలన్’’ కు తేడా తెలియక తికమక పడుతుంటే
డు యు నో దిస్
అండ్ దట్ అంటూ
గజిబిజిగా
గందరగోళం చేస్తున్నారు
బతుకుట తెలియని
వెర్రిబాగులు !
అయినా
నేనెన్నడు
పట్టించుకున్నానని హాహా హాహా ...
అన్న పెళ్ళికి
రెండు రోజులే లీవ్ పెట్టా తెలుసా
అక్క పెళ్ళికి
వర్క్ లోడ్ ఉందని ఇంటి పనులు తప్పించుకున్నా
కజిన్ ల
వ్యవహారలకైతే ఇంకా చెప్పాలా
అసలు పొతే కదా
చావు
దినకార్యాలకు ఇంకా దూరం
ఆ ఏడుపులు
భరించలేను బాబోయ్
ఎక్కడలేని వింతలను
చూడాలి
ఇంకా వంశం
వారిదైతే గుండు కొట్టించుకోవాలి
అమ్మో నా
పరువెమవుతుంది !
ఫుట్ స్కిన్
నలుగుతుందని లూఫర్స్ వాడుతాను
చేతిలో ఐప్యాడ్ చెవిలో
హియర్ ఫోన్స్ కళ్ళకు ఎవిఎటర్స్
షార్ట్ జీన్స్
స్లీవ్లెస్ టీ షర్ట్
ఫ్రెండ్స్ ని
కలవాడానికి వెళుతున్న
నా లెవెల్ చూపాలి
గదా !
ఫేస్బుక్ ఫ్రెండ్
రిక్వెస్ట్ చాల సెలెక్టివ్ గా అక్సేప్ట్ చేస్తా
నా పైత్యాన్ని
భరించడానికి ఉండాలిగా కొందరైనా
లైక్స్ కామెంట్స్
రెగ్యులర్గా పెట్టేవారినే సుమా
లేకుంటే
అన్ఫ్రెండ్ బట్టన్ ఉందిగా !
మీతో టైం వేస్ట్
చేస్తున్నాను
అసలే నిద్దుర
కరువు కాలం
ఊహల్లో సన్నిని
వెతకాలి
ఉంటానూ ..
లైక్స్ కామెంట్స్
మర్చిపోకండి
లేకుంటే తెలుసుగా
.... హాహా హాహా ...
కృష్ణ మణి
No comments:
Post a Comment