__________________కృష్ణ మణి
మలినమయిన లోకంలో సుందర స్వప్నం కోసం
చేట్టుకోమ్మపై పిట్టనై సంధ్య వేల
కరువైన చల్లని గాలిని మదిలో తలచి కునికిపాట్లు
పడ్డాను !
కొమ్మల ఊపుడికి ఉయ్యాల ఊగినట్లు హాయిగా
ఊహలపల్లకిలో సాగిపోయాను
కొన్ని దృశ్యాలు అలా నా ముందునుండి
కదులుతున్నాయి !
అరుణోదయాన
పచ్చని ఆకుల అలికిడి
ఆ వెచ్చని గువ్వలు
కోయిలమ్మల రాగాలు
లేడి పిల్లల గెంతులు
గుంపులుగా చేపల పరుగులు
నింగినంటిన చెట్ల గర్వపాట్లు !
అంతలో ఒక దృశ్యం నన్ను అదిలించి
కదిలించింది
ఒక కాలుష్య కాగడ ఒలంపిక్ జ్యోతిలా మండుతుంది
అడుగున ఇంధనంలా ఒక్కో చిత్రం కాగడ కర్రలోకి
జారుతున్నాయి !
గూడు చెదిరిన పక్షి
నరికిన మొద్దులపై మొలిచే చిగురుటాకుకై
ఎదురుచూపులు
ఒలికిన చమురులో కోన ఊపిరితో కొట్టుకుంటున్న
పక్షుల ఆర్తనాదం
ఆకులు లేని చెట్టుపై పెద్దబోజల ఆకలి చూపులు !
ఇసుక వేడికి కడుపులెండిన ఒంటెల ఎండమావుల
పరుగులు
వాహనాల శబ్దాలు రోడ్డుపై మసి మేఘాలు
ఫ్యాక్టరీ గొట్టాలు పొగలు గక్కుతూ అడుగున
విషజలాన్ని చిమ్ముతుంటే
దాహపు చూపుతో దిక్కులు పట్టిన జీవజాలం !
అంతటనే జలదరింపుతో బెదిరిన కన్ను
తోలికిన ఉప్పు సముద్రం
ఆ తోలుకులో ఇంకా కొన్ని చిత్రాలు అస్పష్టంగా
కదలిపోగా
మొత్తంగా ఆ దృశ్యం మాత్రం నన్ను దోషిగా
నిలబెట్టింది !
కృష్ణ మణి
No comments:
Post a Comment