కవిగాన్ని
______________కృష్ణ
మణి
నాలో ధారగా
ఎదో రాలుతుంది
అది అవేశామా
ఆనందమా
ఆవేదనా తెలియదు
వాగులో
కొట్టుకుంటున్న ఆకులా ఉంది నా స్తితి !
మబ్బులు తొలిగి తొంగి
చూస్తున్న సూర్యున్ని వెచ్చటి వేడిని హత్తుకొని
మసక లోకం
మురుస్తున్న వేల
నాలో ఎదో
కొత్తదనం ఆవహించింది !
విత్తు పగిలి
చిగురిస్తున్న చిట్టి ఆకులా
మనసులో కొత్త
పులకింత నాలో ఉత్సాహాన్ని పెంచుతుంది
చీకట్లో నక్షత్రం
మెరిసినట్లు !
నాకోసమే ఎదో
దాయబడినదని తెలిసి
ఎలా ఉంటుందోనని
ఉబలాటంతో
కునుకు తియ్యక
కాలంతో పోరాటం చేస్తున్నాను !
అడుగులు వడివడిగా
పడుతూ
దాపరికం ఇంకెంతసేపని
నర్మగర్భంగా అరవాలని ఉంది
అది ఎలా ఉన్నా
నాకు గొప్ప అనుభూతే
ఈ ఉత్కంట ఎంత
కాలం ఉంటె అంత ఆనందమేమో నాకు !
ఇప్పుడు నేను ఊహల
రెక్కలతో ఊరేగుతున్న భైరాగిని
నలుగురిలో ఎందుకు
నవ్వుతున్నానో తెలియని పిచ్చివాన్ని
అవును నేను వెర్రివాన్ని
తెలియని
విషయానికి తల్లడిల్లే పసివాన్ని
నిత్యం ఎదో సత్యం
వెతుకుతూ తిరిగే యాత్రికున్ని
నేనో సాదకుడిని
సమయాపాలన తెలియని
ఊహా చిత్రకారున్ని
నేనో కవిగాన్ని !
కృష్ణ మణి
No comments:
Post a Comment