కాలం పరుగు
_________________కృష్ణ
మణి
ఈ నిమిషం మరో
నిమిషం
కాలం నడుస్తుంది
అది ఆగదు
ఎప్పటికి
నీ గమనమే తడబడుతూ
అలసిపోతూ తూలిపోతూ సాగిపోతుంది
చుట్టూ ఉన్న
సమస్తాన్ని ఆక్రమించడమే విధి అనుకునే ముర్ఖుడవు
సహజంగా నీవొక
ఆహంకారివి
తెలివిని
గెలిచినా తెలివరినని భ్రమపాటు
ఒక జీవి మరోజీవికి
బతుకుపోరులో ఆకలవుతుంది
అలకవుతుంది
పరుగవుతుంది
పానుపవుతుంది
నవ్వవుతుంది
ఎడుపవుతుంది
నీడవుతుంది
గోడవుతుంది
గొప్పవుతుంది
చివర ఏమవుతుంది
నీకు మాత్రం లోకువవుతుంది
కాని ఎన్నటికి
నీవు మాత్రం కాలం వెనుక పరుగువే
కరిచిన గడ్డిని గూడుగడుతుంది
పిచ్చుక
వేటాడిన జీవిని
పిల్లలకు ఆహారంగా ఇస్తుంది పులి
ఇంతకు మించి
చేస్తున్నదేదో చెప్పు నిజాయితిగా !
కృష్ణ మణి
No comments:
Post a Comment