నిశబ్దపు ఆలోచన
_______________కృష్ణ
మణి
నిశబ్దాన్ని
వింటున్నాను
ఏదైనా శబ్దం
చేస్తుందేమోనని
ఈ నిశబ్దం ఇంత
స్తబ్దతగా ఉంటుందని ఊహించనేలేదు !
దృశ్యాలు ఎన్నో
కళ్ళముందు దాడి చేస్తున్నాయి వినమని
నవ్వుతున్నారు
ఏడుస్తున్నారు
నడుస్తున్నారు
మోస్తున్నారు
అల్లరి పిల్లల
పరుగులు
మేకల మందల నడకలు
పిట్టల గుంపుల
ఎగురులు
అన్నీ
కనిపిస్తున్నా
నాకేమి
వినపడట్లేవు
నిశబ్దాన్ని
కోరుకున్న పాపమనుకుంటా ఈ నరకం !
ఆ వాన చినుకుల
రాలుతున్నాయి
వాగులు
పొర్లుతున్నాయి
అందరు ఆనందిస్తూ
పండుగలు చేస్తున్నారు
నేనూ అరుస్తూ
చిందులేస్తున్నాను కాని
నేనేమంటున్నానో
నాకే వినపడట్లేదు భావం తెలిసినా
అది విస్పష్టంగా
విన్నప్పుడే కదా అనుభూతి కలిగేది !
మన మనసు ప్రశాంతత
లేనంత వరకు
చుట్టుపక్కల ప్రశాంతతని
కోరుకోవడం అంటే
మనల్ని మనం శిక్ష
విదించుకొని చెవులు మూసుకోవడమే
అందుకు ప్రతిగా
నేననుభావిస్తున్న బాద
జీవితాన్ని
దుర్బరంగా చూస్తూ
దుర్బరమైన
జీవితమని
లోకమంతా ఇంతేనని
తలచటమే దుర్బరం
ఇంకా ఇలా కూడా
అనుకోలేదు నయం
ఈ లోకాన్ని
చూడలేనని మూర్ఖంగా .... హాహా హా !
కృష్ణ మణి
No comments:
Post a Comment