కమ్మకత్తి
______________కృష్ణ
మణి
బీరాన
కమ్మకత్తి తీస్కరమ్మని
మా తాత జెప్పిండు
మ్యాకలకు మ్యాత
కొట్టనీకే
అంటే
యాదికొచ్చింది
మొన్న నా సోపతోడు
జంగడు
బాయిమీద
కొమ్మగొట్టబోయి
కాళ్ళిరిగి
ఎల్లంకల పట్టిండు ఇంట్ల
అప్పడిసంది మా
అయ్యా
బుగులువెడ్తుండు ఆటంకాల
పోవొద్దని
తాతనేమో
పెయ్యి గట్టిగయితదని
ఆంటడు
అయినా
మ్యాకల కడుపులెండుతయని
పానం గొట్టుకుంటది
పొద్దుమీకంగ
దొడ్లగొట్టిన మ్యాకల కపుపులకన్నా
పాలకేడిశే పిల్లల
మోకాల మీద మెరుగులు సూడాలె
అమ్బటల్ల
క్యాన్ల ఇంత
బువ్వగట్టుకొని ఊరగుట్టకు పోతుంటే
అవుసల చారి
కొడుకు బిడ్డే బ్యాగుల మోసుకుంటా
ఈపులు నొయ్యంగ
ఇస్కుల్ బోతరు
ఎం సదువుతరో ఏమో
నెత్తికరాబు జేస్కొని
సదివితే
ఏమొస్తది గుడ్డద్దాలు
తప్పిస్తే
నేనే నయం
ఏట్ల శ్యాపలు ఒరాలకింద
ఎండ్రికాయాలు
చెట్ల కాయలు
పండ్లు తిని రాయోలె అయితా
మా తాత జెప్పిండు
మాటలల్లవడి
మర్షిపోయినా
అగొ మా తాత కూత వెడుతుండు
ఉంటా
కృష్ణ మణి
No comments:
Post a Comment