అందమే ఆనందమే
** కృష్ణ మణి **
పాలబుగ్గల నవ్వు జూస్తే
కఠిన మనసును
కరిగిచేది అందమే ఆనందమే
గుండెపైన ఆటాడే చిట్టి
నడకల చిన్నారిది
అనుబందాల అందమే
ఆనందమే
బుంగమూతి అలకల
కోకిల అల్లరి అందమే ఆనందమే
చెయ్యిపట్టి
అడుగుపక్కన అడుగు
మన నడకతో పరుగు
పెట్టె
బుడ్డి పాదలది అందమే
ఆనందమే
అలసిన తనువు
బుజమేక్కి
కునుకు వాల్చు
సమయం అందమే ఆనందమే
ఆదమరచిన లేత
చిగురుల
ముసి ముసి
నవ్వులు అందమే ఆనందమే
ఎన్ని జన్మల
బందమో
కనులనిండా
మనసుపొంగే క్షణాలతో
ఊయలూపే పసి
పాపలకు
ఉప్పొంగే ఆనంద
అలల సలాం చేస్తున్నాడీ గులాం
కృష్ణ మణి
No comments:
Post a Comment