_________________కృష్ణ మణి
చలి భలేగుంది
రోమాలు నిక్కపొడుచుకొని వెచ్చని మంటను
వెతుకుతున్నవి
సంక్రాంతి సూర్యున్ని త్వరగా రమ్మని
పొగమంచు అద్దుకున్న పుడమి వణుకుతూ
కడలి కెరటంలా పగలుకై ఆరాటపడుతుంది నిత్యం
చలి మరీ చల్లగుంది
మడుగున అడుగు పడక పరుగులు తీస్తుంది జీవం
గూట్లో పిల్లి వలె ఒళ్ళు ముడుచుకొని ఎండలో పండగ
చేసుకుంటుంది
అదేదో లోకం స్తంభించిన భావం యదలో !
చలి బాగుంది
రేపటి వేడిని తట్టుకోలేరని నిన్నటి వర్షం
భరించలేరని
నేటి చల్లదనం దక్కక దప్పిక తిప్పలు తప్పవని
ఓర్చుకొని దుప్పటి ముసురుకొని
తన శ్వాసనే తనకు వెచ్చని సెగ మంటై జోలపాడుతుంది
మనసు !
చలి సరసంగుంది
తోడుకై పరుగులు పెడుతూ
విరహావేదనతో గడచిన గొడవల మనసులు చల్లబడి
మెరిసిన కన్నులు మత్తును వోంపగా ఇదే సైగగా తలచి
ఒడిచేరి ప్రేమను పంచుకోను కార్యంలో సకల జీవం సుఖంగా
ఉంది
కృష్ణ మణి I 11-01-2015
No comments:
Post a Comment