________________కృష్ణ మణి
1
ఆ పువ్వు
రెక్కలు విప్పుకొని ఆహ్లాదంగా గాలి తెమ్మరలతో
ఆటలాడుతూ
నలుగురి దృష్టిని దోచేస్తూ నవ్వులు పూయిస్తుంది
పున్నమి వెన్నలలో పుత్తడి కాంతిలా
ఇది శాశ్వతమా .... అంటే
క్షణమైనా ఇచ్చే సుఖం చాలు నా జన్మకు అంటోంది గర్వంగా
!
2
ఆ వాగు
నిండుగా పొర్లుతూ ఒడ్డున గడ్డి పోసలను ఊపేస్తూ
సకల జీవాన్ని ధరి చేరుమని గల గల శబ్దంతో
పిలుస్తుంది
అంతం లేని ఆకాశంలో మోగిన గజ్జల గలగలలా
ఇది శాశ్వతమా .... అంటే
ఒక పూటైన కడుపు నింపితే చాలు ఈ సారికి అంటోంది
గర్వంగా !
౩
ఆ వేణు కర్ర , పురుగు తొలచి నిత్య గానమై పాటపాడుతూ
అలసిన ప్రకృతిని తన శబ్దంతో జోల పాడుతుంది
తేనెపట్టులో మత్తునిచ్చే తియ్యటి తేనెలా
ఇది శాశ్వతమా ....అంటే
ఒక చోటైన నా పాటతో కోయిలకు పోటినిస్తానంటోంది గర్వంగా
!
కృష్ణ మణి I 27-12-2014
No comments:
Post a Comment