____________________కృష్ణ మణి
తల్లి కడుపున పుట్టిన కొడుకులు
ఆప్యాయతలు మరచి ఆస్తి కోసం
కొడుకుల నడుమ యుద్దమే జరిపితే అది ఏకత్వం ఎలా
అవుతుంది ?
ఊర్లో కులాల మధ్య కుహనావాదులు
అస్తిత్వం అంటూ అంటురోగాలు వ్యాప్తి చెందించి
ఆ వాడలో మంటలనంటిస్తే అది ఏకత్వం ఎలా అవుతుంది ?
మనసులో గజ్జి కలిగి దురదతో
ఇది నాది అది నీది అని అగ్ని ధారలు కురిపించి
మనషుల నడుమ బేదాలు రగిలిస్తే అది ఏకత్వం ఎలా
అవుతుంది ?
దేశంలో మతాల ముచ్చుకేలిలో మూర్ఖులు
నాది గొప్ప నీది చిప్పా అని చాందస పాండిత్యం పొంగి
పొరలి
తలలు వేరు చేసి బుల్లెట్ల వర్షం కురిపిస్తే అది
ఏకత్వం ఎలా అవుతుంది ?
ఈ ప్రపంచంలో ఒకే రంగు మనషి లేడు ఒకే బాష లేదు
ఒకే సంస్కృతి లేదు ఒకే ఆచారం లేదు మరి అందరోకటే
కాని ఇవ్వన్నీ వేరు అంటే అది ఏకత్వం ఎలా అవుతుంది
?
మతానికొక దేవుడుంటే మానవత్వం లేదని అర్ధం
అవును అది నిజమే అందుకే
అప్పుడప్పుడు ఒక మూలాన నోబెల్ ఇచ్చి నిరూపిస్తారు
!
కృష్ణ మణి
I 24-12-2014
No comments:
Post a Comment