వికారం
_______________కృష్ణ
మణి
మనసు నీడన ఒక
వెలుగు
పసిపాపలా కునుకుపాట్లు
ఎవరో దాడి
చేస్తారని
వణికి వణికి
ఊగుతుంది
మనిషి బయటికి ఎంత
గంభీరంగా ఉన్నా
లోలోన భయానికి
పైన మేకపోతే !
చుట్టుపక్కల
ఎందరు కాపలా ఉన్నా
అర్దరాత్రి తలుపు
తట్టే గుండేనొప్పికి
శ్వాస నింపడం
అవుతుందా వారికి
ఎదురుగ వస్తున్నా
మనిషి
సూటిగా నీకై
చూస్తే
తడబాటు
నీలో మంచి ఉందో
లేక బురద ఉందో
ఒక్కసారి చూసుకో
ఆ అద్దంలో చూసుకొని
చెప్పు నిజాయతిగా
ఎందుకు నీలో నీవే
ఏడవడం
నలుగురిలో ఒకనిగా
ఉండక
ఉన్నదంతా కాటికి
తోడోస్తాయని భ్రమ కదూ !
ఉండు అలాగే ఉండు
చివరిదాకా
అహంకారాన్ని మోస్తూ ఉండు
అది ఎప్పటికీ
నీ అందానికి
వికారమే
తెలుసుకొనే సరికి
ఎందరిని వదులుకుంటావో
ఎందరు దూరమవుతారో
కృష్ణ మణి
No comments:
Post a Comment