Thursday, March 6, 2014

మా అవ్వ


**********

మా అవ్వ !
కాళ్ళకు కడియాలు 
నడుముకు ఎండి పట్టి 
చేతులు మెరిశే గోట్లతోడ గాజులు 
మోజేతికి కడియమేషి 
మేడల గుండ్లారం 
ముక్కుపుల్ల 
చెవుల గెంటీలు 
ముతకశీరల 
నోసలుకు పెద్ద బొట్టుతో 
సున్నీకే తమాషగుంది !

మా అమ్మానాయిన అదృష్టం 
చూశిన్రు కండ్లనిండ ఆ అందం 
మాకయితే పాత పోటవల జూసి మురుసుడాయే !

కృష్ణ మణి I 05-03-2014

No comments:

Post a Comment