Monday, March 17, 2014

లోకం


********

తెలిసిన లోకముకన్నా ,
తెలియని విషయాలెన్నో ?

గడచిన కాలముకన్నా ,
గడవని రోజులెన్నో ?

కలిగిన సుఖముకన్నా ,
కలచిన దుఃఖాలెన్నో ?

మానిన పుండుకన్నా ,
మాయని గాయాలెన్నో ?

గెలిచిన ఓటమికన్నా ,
ఓడిన విజయాలెన్నో ?

కరిగిన మనసుకన్నా ,
కాలిన గుండెలెన్నో ?

చెదిరిన బతుకుకన్నా ,
చెరచిన మానాలెన్నో ?

జరిగిన ఘోరంకన్నా ,
జరగని న్యాయాలెన్నో ?

నిండిన కడుపుకన్నా ,
నిండని కేకలెన్నో ?

తడసిన నేలకన్నా ,
మునిగిన భూములెన్నో ?


కృష్ణ మణి I 09-03-2014  

No comments:

Post a Comment