Monday, March 17, 2014

బసంతి

హోలీ శుభాకాంక్షలు
బసంతి
********
మోదుగ పూల నవ్వుల వనం  
ఆ సుందర వర్ణంతో మురిసిన జనం  
ప్రకృతి అంతా మోడు వారి
వసంతాలాపన చేస్తూ చిగురు తొడిగే
సమయాన్ని గుర్తు చేయగా
ఈ పూలు ముందుగానే
వసంతానికి ఆహ్వానం పలుకుతున్నాయి
ఆనందంలో ముంచును లోకాన్ని
అందుకే వాటిని బసంతి పూలని
వసంతానికి చిహ్నంగా పొగడుతాము  !

ధరణి మురిసేను నేడు
మోడువారిన అడవి మెరిసేను చూడు
బసంతి పూల ఆభరణాల ధగ ధగలో !
హోలీ రంగుల్లో తడసిన గుండెలు
ఆప్యాయతల అల్లరిలో పొంగిన మనసులు !

కృష్ణ మణి I 17-03-2014


No comments:

Post a Comment