చెత్త బతుకు
____________________ Krishna Mani
చేతిలో మొల గుచ్చిన కట్టే
సంకకు సంచి తెగిన చెప్పులు
తెల్లారింది మాకు
చెత్తను ఏరి
మా బతుకులను నింపడానికి
పెంటకుప్పలే భోజనశాల
ఆకలికి అక్కడే ఓదార్పు
పాచిన వంటలు
మురిగిన పళ్ళు
కుక్కల పందుల పోటి పరుగు !
ఇనుము ప్లాస్టీకు కాగితాలు
ఇవే కదా ఆధారం
ఇదే మా జీవితం
విసిరిన వస్తువు
కంటికి మురిపెం
మంచివి చెడ్డవి అన్నీ మావే
బరువు పెంచుతూ
ఆశలు అల్లుతూ
రేపటి రోజుకు చెదరని చూపు !
తరగని చెత్త
నోయ్యని కాలు
పగలు దాటితే
సాగని నడకలు
చేరని తీరం
దించిన మూటలు
అమ్మిన కష్టం
అందిన సొమ్ముతో
అందని వెలుగు
బతుకు పోరులో నిత్యం వేటగాల్లం
చావని ఆశతో మసలే ముల్లుజల్లెలం !
కృష్ణ మణి I
No comments:
Post a Comment