పట్నం
_________________క్రిష్ణ మణి
పట్నం మంచిగున్నది
ఎండిన పూలపై అత్తరు జల్లుకొని
బొగ్గుల కొలిమిపై దుప్పటి కప్పుకొని
చిన్న తొవ్వను
పెద్ద తొవ్వ మింగి
నలుపునద్దుకొని
తెలుపునన్నది
పట్నం మంచిగున్నది
అద్ద్దాల మేడలను
కుప్పలుగా పోషి
కంపుటర్లకు పరుగు పెట్టి
పైసలను పుట్టిస్తున్నది
మనషుల్ని నలుస్తున్నది
పట్నం మంచిగున్నది
డిస్కో లైట్ల చీకట్లలలో
చినుగుతున్న బట్టలను చూసి
పరువు తీసుకుంటూ
పరువునిలబెడతానంటున్నది
పట్నం మంచిగున్నది
ఎర్రలైటు పడగానే
పెద్ద కారు ముందు
చెయ్యి సాపి పసిపానం అకలాకలన్నది
నల్లద్దాలను కింద జరిపి
ఉరిమి జూపు సూడగానే
బెదురుబడిన చిన్న పొట్ట
కడుపెండి కూలినది
పట్నం మంచిగున్నది
ఔను చిత్రంగా
పట్నం మంచిగున్నది
వెలుగుజిలుగుల రాత్రుల నవ్వులు
మనసును ఒలలాడిస్తాయి
ఆ వెనక నిశీధిని అనచి
అంతరాలను ఎత్తి చూపి ఎక్కిరిస్తాయి
పట్నం మంచిగున్నది
ఎండిన పూలపై అత్తరు జల్లుకొని
బొగ్గుల కొలిమిపై దుప్పటి కప్పుకొని
పట్నం మంచిగున్నది
క్రిష్ణ మణి
_________________క్రిష్ణ మణి
పట్నం మంచిగున్నది
ఎండిన పూలపై అత్తరు జల్లుకొని
బొగ్గుల కొలిమిపై దుప్పటి కప్పుకొని
చిన్న తొవ్వను
పెద్ద తొవ్వ మింగి
నలుపునద్దుకొని
తెలుపునన్నది
పట్నం మంచిగున్నది
అద్ద్దాల మేడలను
కుప్పలుగా పోషి
కంపుటర్లకు పరుగు పెట్టి
పైసలను పుట్టిస్తున్నది
మనషుల్ని నలుస్తున్నది
పట్నం మంచిగున్నది
డిస్కో లైట్ల చీకట్లలలో
చినుగుతున్న బట్టలను చూసి
పరువు తీసుకుంటూ
పరువునిలబెడతానంటున్నది
పట్నం మంచిగున్నది
ఎర్రలైటు పడగానే
పెద్ద కారు ముందు
చెయ్యి సాపి పసిపానం అకలాకలన్నది
నల్లద్దాలను కింద జరిపి
ఉరిమి జూపు సూడగానే
బెదురుబడిన చిన్న పొట్ట
కడుపెండి కూలినది
పట్నం మంచిగున్నది
ఔను చిత్రంగా
పట్నం మంచిగున్నది
వెలుగుజిలుగుల రాత్రుల నవ్వులు
మనసును ఒలలాడిస్తాయి
ఆ వెనక నిశీధిని అనచి
అంతరాలను ఎత్తి చూపి ఎక్కిరిస్తాయి
పట్నం మంచిగున్నది
ఎండిన పూలపై అత్తరు జల్లుకొని
బొగ్గుల కొలిమిపై దుప్పటి కప్పుకొని
పట్నం మంచిగున్నది
క్రిష్ణ మణి
No comments:
Post a Comment