____________________కృష్ణ మణి
రైలు పట్టాలెక్కిన చిట్టి నడక
చివరి గడియలు రోడ్డు పైనే
అదిరిన మనసులు క్షణకాలం కూడా నిలివలేదు !
ఇనుప రేకుల డబ్బాలో నలిగిన మొగ్గలు
ఎగిరే పావురాలను పంజరంలో పెట్టి తొక్కి పట్టిన
బండరాయి
ఈ పాపపు కర్మ ఎవరిదీ ?
ఆ కర్మకు బలి ఎవరు ?
లోకం ఎరుగని పాదాలు
నోటు బుక్కుల్లో చెదిరిన అక్షరాలు
అమ్మ పెట్టిన ముద్దలు ఇంకా అరగలేదు
టిఫిను బాక్సులో అన్నం చల్లి కడుపు నింపిన పసి
ప్రేమలు !
ఎందరి తల్లుల కడుపులు కాలెను ?
ఎందరి తండ్రుల గుండెలు ఆగెను ?
కృష్ణ మణి
I 24-07-2014
No comments:
Post a Comment