________________కృష్ణ మణి
పెదవంచున మెరిసిన వెలుగు
రవికాంచని మనసున కురిసిన వెన్నెల
ఆ వెలుగు వెన్నెల జాతర ఉండునా కలకాలం అని అడిగిన
కన్నులు
అవునని కొందరి ఆలోచన
కాదని ఇంకొందరి వాదన
ఇంతకీ ఎవరి దారి ఏది ఆగని గోదారి నడకన ?
మోహంతో శాంతిని వెతికే సంసారులకు ఒక దారి
ఏకాంతంలో మోక్షం పొందే సన్యాసులకు మరో దారి
వింత దారుల్లో వెనక ముందు పరుగుల గమ్యం !
నయనానంద దృశ్యం మనసున మల్లెలు కురిపిస్తే
కళ్ళు మూసుకొని ఆనందం అంచున ఆడే ఆరాటం ఒక వింత
అనుభవం
తడబడు అడుగుల గమనంలో అందక పొందక అహంకారమే అలంకరణ !
వీధి వీధి భాగోతాల అంతర్మధనంలో విహరించే వెర్రి
నవ్వుల కన్నా
తల్లిని గుర్తెరిగి చిదానంద చిద్విలాస జాతర చిరుకాలమైన
మిన్నేగా !
No comments:
Post a Comment