తెలంగాణా
గుండెల్లో సంబురాల జాతర..! ఏడ సూడు ఎగురుతుంది
ఉద్యమాల జండ రా ...!
చిన్న
పెద్దలంత కూడి అందుకున్న పాట రా ! ఆనందం తట్టలేక ఆడుతున్న డప్పు రా..!
అమ్మయ్య
కనులల్లో సంతోషం సాగేరా...!
ముసలోళ్ళ మనసులల్ల నెరవేరిన చింత రా ...!
చిన్నారి
పసి పాపల చిరు నవ్వులే ఆస్తిరా ..!
ఆ కష్టం మరిచాము ఇక ఎ నష్టం లేదురా..!
ఆంధ్ర
గద్ద పోడుసుల్లు ఇక మనకు లేవురా..!
పోలిసూ బూట్ల దేబ్బలింక మనకు ఏలరా..!
బుద్ధిబలం
నీదిరా , భుజబలమూ నీదిరా !
ఆకసమే నీ హద్దు అందుకోర ఆ ఎత్తు..!
చీకట్లో
కష్టాలు ఇక లేవని ఆశరా..!
మనకున్న
తిప్పలింక చెల్లవురా సోదరా...!
రాబోయే
చిన్నోల్లకు దారివేయ్యబూనురా...!
లేకుంటే తప్పదురా శున్యమే అన్డరా...!
---
Krishna Mani

No comments:
Post a Comment