చేను కాడ సంపెంగ పూల అల
కొమ్మ పైన పక్షి పిల్లల గోల
గట్టు కింద కర్కాటాల వల
మేఘాల ఓంపులో దాగిన జల
ఎండిన కళ్ళలో ఒదిగిన కల
****************************
చిటపాట చినుకులు!
మిడతల అరుపులు !
మిణుగురు మెరుగులు !
జల జల మోతలు !సవ్వడి గాలులు !
కప్పల గంతులు !పాముల సందడి !
ఉరుముల కాంతిలో మెరిసిన జాతర !
మదిలో ఊగెను మత్తున తీగలు !
***************************************
చిగురుటాకుల పైన చినికులు !
చిన్నారుల కళ్ళలో తళుకులు !
చిన్నదాని యదలో వణుకులు !
చింతలో ఉన్నరైతు చిందులు !
--కృష్ణ మణి
No comments:
Post a Comment