నా పల్లె గోడు
_______________ కృష్ణ మణి
చమట చుక్కల వర్షంలో
తడిసిన కాంక్రీటు అడవి
చుక్క చుక్కకో గుండె కోతల గాధ
భూమి బీటల నడుమ
నీటి చుక్కల వేట
దొరకని వేల
ఆరని ఆశల పోరాటం
ఆరిన డొక్కల ఆరాటం
బిడ్డె పెండ్లి కోసం
కొడుకు రోగం కోసం
చేను మందు కోసం
పెండ్లం పుస్తలమ్మి
అవి సాలక
ఇవి సాలక
గొడ్డు గొదమమ్మి
బతుకు నడవక
బయలు దేరిన బాటసారులు
దారేక్కడ పోతుందోనని
అడుగుల కదలిక
తెలియక తికమక
గుండెలో బికబిక
ఈ రోజు గడిచేనా
ఈ పరుగు ఆగేనా
ఎప్పుడో ఎట్లనో
ఈ జీవుల కష్టం ఒడ్డు చేరేది
కృష్ణ మణి
No comments:
Post a Comment