Wednesday, February 10, 2016

కాల సర్పం


కాల సర్పం
____________________కృష్ణ మణి

కరెంటు వైర్ల మీద కాకి పీనుగుల స్వాగతాలే కదా
రోడ్డు పక్కన తోరణమై పలకరిస్తుంది నా ఊరి ముందు !

మోడువారిన గల్లీలళ్ళ   
ఎగురుతున్న ప్లాస్టిక్ బ్యాగులేగా
నను జూసి నవ్వుతున్నై !

దుర్గమై నిలబడ్డ బూరుగు చెట్టు
ఇప్పుడు నేలకూలి భూమికి సామనమై
రేపో మాపో మునుగుతానని ఏడుస్తున్నట్లుంది
సర్కారు తుమ్మలు మెల్లంగ
రాజ్యమేలుతున్నట్లుంది ఊరిని !

మసక చూపుతో
మల్లయ్య తాత ఎదురొచ్చి
కంకరనెత్తే కన్నపిల్లలెట్లున్నరని
గుండె చెరువు చేసుకొన్నడు

వండ్రగులు అవుసులోళ్ళు
కమ్మర కుమ్మర సాకలోళ్ళు
సావుజాలక బతుకీడుస్తున్నరు
పట్నం సోకులు పల్లెకంటగా !

చెరువు అలుగుపారి పంటకందక
పొట్టెండి పొళ్లు పొళ్లు తాళ్ళు రాలే
దూపకు నోరెండి కట్టమీద పిట్టే కుములవట్టె
పెద్దబోజల జాతరలో జీవుల గుడ్లెండే

పండుగపొద్దుకు ఎండపొద్దుకు ఇలువలేక
ఊరు గొడ్డుబోయి గొడ్లన్ని తబెలాల బాయిలవడే    
మనిషికి మనిషి రక్తం మిగులవట్టే ఆఖరికి
ఆడు మునిగి పుట్టే ముంచిందన్నట్లు !

కృష్ణ మణి 

No comments:

Post a Comment