బంగారం
_____________కృష్ణ
మణి
అమాయకపు చూపు
దీనంగా చూసింది
నావైపు
నాన్న, అమ్మ
తిట్టిందని
జారుతున్న జలపాతం
తన చెక్కిళ్ళపై
నుండి రాలుతుంటే
మనసు
కొవ్వొత్తిలా కరిగి
చేతులు చాచి
గట్టిగా అత్తుకొని
తన కంటివాగు ఆగే
దాక
నా మనసు వాగును జతచేసాను
తన కంటబడక
ధైర్యం
నింపుకొన్న చిట్టి గుండె
నాన్న, నా
తప్పేమీ లేదంటుంటే అమాయకంగా
పోనీలేమ్మా ,
అమ్మను కొడదాము సరేనా అంటే
మోహంలో సంతోషం
పెదాల్లో ఎటకారం
వాళ్ళమ్మను
చూస్తూ
అలిగిన తల్లిని
ఓదార్చేది ఆ చిట్టి తల్లే మరి
అమ్మా , అమ్ము
తింటా అనగానే
కన్నతల్లి ప్రాణం
విలవిలలాడి
ఆ చిన్ని బొజ్జను
నింపి తన గుండెను నిమ్పుకొంది
ఆద మరచి
నిద్రలోకి జారుకున్న పసిప్రాణాన్ని చూస్తూ
మా బంగారం అంటూ
మురిసిపోవడం మాములయ్యింది మాకు
కృష్ణ మణి
No comments:
Post a Comment